Tuesday, October 20, 2009

Firewall … అంటే..??

Firewall … అంటే..??




firewall

మన కంప్యూటర్‌కి ఇంటర్నెట్‌కి మధ్యా లేదా మనం వాడుతున్న కంప్యూటర్‌కి LAN లో ఉన్న్ ఐతర కంప్యూటర్లకు మధ్య నెట్‌వర్క్ ట్రాఫిక్‌ని ఫిల్టర్ చేసే సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లేదా హార్డ్ వేర్ డిజైన్‌నే Firewall అంటారు. నెట్‌వర్క్ లో ఫైర్‌వాల్ Denial-of-Service (DoS) వైరస్‌లు, worms,హ్యాకింగ్ వంటి పలు దాడుల నుండి రక్షిస్తుంది. ఫైర్‌వాల్ యొక్క ప్రధానమైన లక్షణం ఇంటర్నెట్ నుండి మన సిస్టమ్‌కి చేరుకునే సమాచార ప్రవాహాన్ని మన పిసిలోకి చేరకుండా అడ్డుకోవడం. ఇలా మొత్తం డేటా అడ్డుకుంటే మనకు వెబ్ సైట్లు గట్రా ఎలా ఓపెన్ అవుతాయి అనే సందేహం మీకు కలగవచ్చు. ఫైర్‌వాల్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత వెబ్‌సైట్లని బ్రౌజ్ చేయ్యడానికి మనం ఉపయోగించే Firefox, Internet Explorere, Google Chrome, Opera వంటి వివిధ బ్రౌజర్లని, Yahoo Messenger, Gtalk వంటి మెసెంజర్ సాఫ్ట్ వేర్లనీ.. మనం స్వయంగా Trusted Zone లోకి జతచేసుకోవాలి. అంటే ఆయా ప్రోగ్రాములు ఇంటర్నెట్‌కి ఫలానా సైట్ ఓపెన్ చెయ్యమని రిక్వెస్ట్ పంపిస్తాయి. దానిని రిటర్న్ లో మనం కోరిన మేరకు డేటా తిరిగి లభిస్తుంది. అంటే కేవలం మనం ఉపయోగించే ప్రోగ్రాములను మాత్రమే Internet Traffic స్వీకరించేలా ఫైర్‌వాల్‌లో కాన్ఫిగర్ చేస్తున్నామన్నమాట. సహజంగా వైరస్‌లు, ట్రొజన్స్ వంటివి మన కంప్యూటర్‌పై DDoS దాడులు వంటివి చేయబడినప్పుడు ఆయా ప్రమాదకరమైన వైరస్‌లు/అటాక్‌లు మనకు తెలియకుండా మన పిసి నుండి ఇంటర్నెట్ ద్వారా రిక్వెస్ట్ లు పంపించి హ్యాకర్ ద్వారా ఆదేశాలు పొందడానికి, లేదా మన పిసిలోని సమాచారం హ్యాకర్‌కి చేరవేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. సో.. సమర్ధవంతమైన firewall ని ఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదకరమైన ప్రోగ్రాములు ఏమైనా నెట్‌ని యాక్సెస్ చెయ్యడానికి ప్రయత్నిస్తే ఆ firewall దానిని అడ్డుకుని వాటిని అనుమతించాలా లేదా అని మనల్ని కోరుతుంది. దీంతో అనేక దాడుల నుండి రక్షణ పొందొచ్చు..

No comments:

Post a Comment