Thursday, October 8, 2009

ఏ వస్తువైనా ఏ బ్రాండ్ కొంటే బెటరో తెలుసుకోవడానికి..

వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ఓ వస్తువు కొనాలనుకున్నప్పుడు మార్కెట్లో లభించే వివిధ బ్రాండ్ లలో ఏ కంపెనీది ఎంచుకుంటే మంచిదన్న సంశయం తరచూ మనకు తలెత్తుతుంటుంది. ప్రతీ బ్రాండ్ లోనూ కొన్ని అదనపు ప్రయోజనాలు, లోపాలు, కస్టమర్ కేర్ సహకారం సరిగా లేకపోవడం, వారెంటీ సమస్యలు వగైరా ఎన్నో అంశాలు మిళితమై ఉంటాయి. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటేనే మనం వెచ్చించే సొమ్ముకి సరైన బ్రాండ్ ని ఎంచుకోగలం! సహజంగా ఏ వస్తువు ఎలా ఉందో తెలిసిన వారు చెబితే తప్ప వేరే మార్గాల ద్వారా మనకు అవగాహన కలిగే అవకాశం తక్కువ. ఈ లోటుని దృష్టిలో ఉంచుకుని http://mouthshut.com/ అనే భారతీయ సైట్ లో మన మార్కెట్లో లభించే వివిధ వస్తువులు, సేవల గురించి దేశవ్యాప్తంగా ఉన్న పలువురు వినియోగదారుల అభిప్రాయాలు, రివ్యూలు, రిమార్కులు ఒకచోట లభిస్తున్నాయి. నా వరకూ నేను Tata Sky, DishTV మాత్రమే DTH మార్కెట్లో ఉన్న సమయంలో ఈ రివ్యూల ఆధారంగా Tata Skyని ఎంచుకోగలిగాను. వివిధ బ్రాండ్ ల మీద పూర్తి అవగాహన వస్తుంది ఈ సైట్ ద్వారా!
ప్రత్యేకతలు:
ఇందులో కార్లు, బైక్ లు, MP3 ప్లేయర్లు, డిజిటల్ కెమెరాలు, డివిడి ప్లేయర్లు, వీడియో కామ్ కోడర్లు, పిసిలు, లాప్ టాప్ లు, ఇంటర్నెట్ సేవలు అందించే ISPలు, టీ, సాఫ్ట్ డ్రింక్ లు, టివిలు, ఫ్యాన్లు, సినిమాలు,, మేగజైన్లు, రెస్టారెంట్లు, మినరల్ వాటర్ వంటి విస్తృత శ్రేణి ఉత్పాదనలపై ఇప్పటికే వాటిని ఉపయోగించిన ఇతర వినియోగదారుల సమీక్షలు లభిస్తుంటాయి.


సైట్ అడ్రస్: http://mouthshut.com/

No comments:

Post a Comment