
ఒకే గొడుగులో నడిచిన
మన అడుగులకు తెలుసు ప్రేమంటే.....
ఒకే మెరుపుకు కలిసిన
మన కనులకు తెలుసు ప్రేమంటే.....
కంటి సైగతో పలకరిస్తే...బదులు పలికే
నీ చిరునవ్వుల పెదవులకు తెలుసు ప్రేమంటే.....
మమత నిండిన నీ చేతి స్పర్శకు
పులకరించే నా మదికి తెలుసు ప్రేమంటే.....
కలలు నిజమై...కాలము కవితై....
కలిసిపోయే మన హృదయమే ప్రేమంటే..........!!!!!!
send this
ReplyDelete