Friday, September 18, 2009

చిరుగాలి.....!!!!

చిరుగాలి.....!!!!



మంచుకురిసే చల్లని రేయి,
నీకిష్టమయిన ఈ గులాబీ తోట కూడా
వెన్నెల పందిరి కింద నీ రాక కోసం ఎదురు చూస్తుంది
నీవు తిరుగాడిన ఈ పచ్చిక సయితం
మంచు బిందువులను ఏర్చి కూర్చి ముస్తాబయ్యింది నీ స్పర్శ కోసం
అప్పుదేప్పుదేప్పుడో ఎండుటాకుపైన నే రాసిన ప్రేమ లేఖ
రెప రెపల చప్పుడు ప్రేమ గీతంలా వినిపిస్తుంది
నా గుండెలనిండా నిన్నీ నింపుకుందామని నేను వేచి ఉంటె
గుండెలు కోసే ఏకాంతం నా మనసుని భయపెడుతుంది...
నా మనసు నిండా ఉన్న ప్రేమ ఆ వెండి మబ్బులనుండి
జాలువారిన తొలి చినుకంత స్వచంగా ఉంది
నా ప్రేమని ప్రపంచానికి పంచటానికి తోడు రావా నేస్తమా...
నాకే కాదు నా ప్రేమకు కూడా ఒంటరితనమంటే భయమే
నా ప్రాణానికి ఊపిరి పోసావు, నా ప్రేమకి ప్రాణం పోయవా చిరుగాలి........!!!


మీ రామ్

No comments:

Post a Comment