
ప్రియా ప్రియతమా...
ఇటు చూడు,
నా వైపు చూడు,
నా కళ్ళలోకి చూడు,
నా కళ్ళలోని నీ రూపు చూడు
ప్రియా ప్రియతమా
జీవం లేని నా కళ్ళు చూడు,
నీ కాళ్ళ రెపరెపలు చూడలేని ఆ కల్లెందుకు.
ప్రియా ప్రియతమా
మూగబోయిన నా నోరు చూడు,
నిన్ను ప్రియతమా అని పిలవటానికి వీలు లేని ఆ నోరు ఎందుకు.
ప్రియా ప్రియతమా
సరిగా లేని నా గుండె చప్పుడు విను,
నీ గుండె ని తాకలేని ఆ చప్పుడుఎందుకు.
ప్రియా ప్రియతమా
ఆగిపోతున్న నా శ్వాసని తాకు,
నీ శ్వాస లో చేరలేని నా శ్వాస ఎందుకు.
ప్రియా ప్రియతమా
నేనే నీవై ప్రేమించా,
నువ్వు నేను ఒకటవుతామనుకున్న,
నన్ను వదిలి వెళ్ళిపోయావు,
నీతో కలిసి జీవించలేని ఈ ప్రాణమెందుకు,
అందుకే ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోతున్నా....
తెర వెనక కథ:ఇందులో ఆ ప్రేమికుడు చెపుతున్న ఆమె,తనని వదిలి వేరే వాళ్ళని పెళ్ల్లి చేసుకుంది అనుకుంటున్నారా? కాదు.
పెళ్లి చేసుకునే ముందు రోజు ప్రమాదం జరిగి మరణించింది...
ఆమె లేని తన జీవితం వ్యర్ధం అనుకున్నాడు..అందుకే తను కూడా మరణిస్తూ ఈ చివరి ప్రేమ లేఖ రాసాడు..
తన ప్రియురాలు చని పోయిందని తను కూడా చని పోవడానికి నిర్ణయించుకున్న ఆ ప్రేమికుడి నిర్ణయం సరయినదో కాదో మీరే చెప్పాలి...
alochinchi manasutho rasina priyudu oka kavi,prema ki artam telini murkudu, preyasi marnam vini jivimchina vadu maniisi kavali,maranimchena vadu premaga marali, marananni vedike vadu.............maha murka sikamani
ReplyDelete